ప్రధాని మోదీ పర్యటనపై .. జో బైడెన్ స్పందన ఇదే
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ముందెన్నడూ లేని ముందడుగు వేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత క్రియాశీల పరిణామపూర్వక బంధమిదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం బైడెన్ స్పందించారు. అమెరికా, భారత్‌ల స్నేహం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనది. బలమైనది. మరింత సన్నిహితమైనది. గతిశీలమైనది అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. మోదీ పర్యటన ద్వారా ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత, దాపరికం లేని, సుసంపన్న, భద్రమైన పరిస్థితులను నెలకొల్పే విషయంలో రెండు దేశాల నిబద్ధత నిరూపితమైందని శ్వేతసౌధం వెల్లడిరచింది. విద్యలో పరస్పర సహకారం, ప్రజల మధ్య సంబంధాలు, వాతావరణ మార్పుల్లో సవాళ్లను ఎదుర్కోవడం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇద్దరు నేతలు చర్చించారు. రక్షణ అంతరిక్షం, వాణిజ్య రంగాల్లో సహకారంపై భారీ ఒప్పందాలకు మోదీ పర్యటన వేదికైంది అని శ్వేతసౌధం వివరించింది.






