హాస్యం, వ్యంగ్యాలే ఆయనకు ప్రజాదరణ
రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ ఉపయోగించేవి రెండే ఆయుధాలు. హాస్యం, వ్యంగం. ఈ కారణంగానే ఆయన ప్రజాదరణ పొందారు. సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించే ట్వీట్లలో ఆయన ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా రాసే ఆయన రాజకీయ ట్వీట్లకు విశేష ఆదరణ ఉంది. ఆయన చేసిన ట్వీట్లపై మిషిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరిశోధన చేసింది. ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్లో ప్రచురించింది. ఆరేళ్లలో చేసిన తొమ్మిదివేలకు పైగా ట్వీట్లను తొమ్మిది వర్గాలుగా విభజించింది. క్రికెట్, రాహుల్‌గాంధీ, వినోదం, వ్యంగ్యం, అవినీతి, అభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, హిందూ మతం, శాస్త్ర-సాంకేతిక రంగాలుగా వర్గీకరించింది. హాస్య, వ్యంగ్య ట్వీట్లను ఎన్నికల సమయంలోనే ఇచ్చారు. ఈ తరువాత నిలిపివేశారని పరిశోధన చేసిన సహాయ ఆచార్యుడు జొయోతీ పాల్ చెప్పారు.













