ప్రధాని మోదీకి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం
దేశంలో పరిశుభ్రమైన పరిసరాల లక్ష్యంగా స్వచ్ఛభారత్ అభియాన్ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం లభించనుంది. ప్రముఖ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంస్థ ప్రధాని చొరవకు గానూ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పట్టుదలతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రధాని మోదీకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ అవార్డులు రావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఇప్పుడు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు ఆయన్ను వరించింది. త్వరలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ అవార్డును ఆందుకోనున్నారు అని ప్రకటించారు.













