ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపికయ్యారు. ఆయన నాయకత్వానికి 75 శాతం మంది ఆమోదం తెలిపారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్, మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయోల్ లోపెజ్ ఒబ్రాడెర్ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 8వ స్థానం, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్‌కు 13వ స్థానం దక్కింది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అవ్రూవల్ రేటింగ్‌లో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచంలోని మొత్తం 22 మంది నాయకుల ప్రజాదరణ విషయమై ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వరకు ఆ సంస్థ ప్రజాభిప్రాయాలు సేకరించింది. స్వదేశంలోను, ఇతర దేశాల్లోనూ అభిప్రాయాలు తెలుసుకొని రేటింగ్ ఇచ్చింది.













