అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది జూన్ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన పలు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య, సంబంధాలపైన కూడా మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలన, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై అగ్రనేతలు చర్చించారు. పేదరికం, నిరక్షరాస్యత మొదలైనవాటిపై పోరాడేందుకు కలిసి వచ్చే ఎవరితోనైనా నిబద్ధతతో సహకరిస్తామని అమెరికా అధ్యక్షునికి తెలిపారు.













