మోదీతో ఫోన్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్
భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. వాణిజ్య సంబంధాల గురించి ఇద్దరూ సంభాషించినట్లు వైట్‌హౌజ్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న సంబంధాల అంశంలోనూ సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరంపై ఇద్దరూ మాట్లాడారు. 2019లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలపరచాలని నిర్ణయించారు. వాణిజ్య లోటును పూడ్చేందుకు కావాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత అంశాన్ని కూడా చర్చించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. అయితే అమెరికాకు మొదట్లో భారత్ కూడా వార్నింగ్ ఇచ్చినా, ఇంకా అటువంటి చర్యలు ఏమీ చేపట్టలేదు.













