ట్రంప్ టీమ్ లోకి ఇండో అమెరిక్లకు చోటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం లభించింది. కరోనా మహమ్మారితో పతనమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ట్రంప్ 200 మంది ప్రముఖులతో 6 సలహా సంఘాలను ఏర్పాటు చేశారు. ఇందులో పిచాయ్, నాదెళ్ల, అరవింద్ కృష్ణ (ఐబీఎం), సంజయ్ మహోత్రా (మైక్రాన్)తో పాటు ఆరుగురు ఇండో అమెరికన్లకు చోటు దక్కింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ వంటి ప్రముఖులు కూడా సలహా సంఘంలో ఉన్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.













