వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిదికాదు : సత్య నాదేళ్ల
ట్విట్టర్ వంటి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం కు ప్రాధాన్యతనిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లను ప్రశ్నించగా ఇంటి నుంచి పనిచేయడం ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. దీని వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత సమావేశాల స్థానంలో వర్చువల్ వీడియో కాల్స్ వల్ల ఉద్యోగులకు సమాజంలో కలవలేని, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ఏర్పడుతుందని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నారు. నిర్బంధంలో ఉండడం వల్ల దేశం, ప్రపంచంలోని అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని సౌకర్యాన్ని ఇచ్చాయి. చాలా కంపెనీలు దీనిని కొనసాగించాలని కూడా ఆలోచిస్తున్నాయి.
ఇటీవల ట్విట్టర్ ఇసిఒ జాక్డోర్సే తన ఉద్యోగులకు ఇంటి నుండి పదవీ విరమణ వరకు పని చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల దీనిపై స్పందించి ఇంటి నుంచి శాశ్వతంగా పని చేయడం ఉద్యోగుల ఆరోగ్యానికి, వారి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. వర్చువల్ వీడియో కాల్స్ వ్యక్తి సమావేశాలను భర్తీ చేయలేమని నాదేళ్ల అభిప్రాయపడ్డారు. నేటి పరిస్థితిలో ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త సమస్యతో వ్యవహరిస్తున్నామని నాదెళ్ల అభిప్రాయపడ్డారు.













