పెప్సీ సీఈఓ పదవికి ఇంద్రా నూయి వీడ్కోలు
పెప్సీ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి ఇంద్రా నూయి వైదొలగటం ఖాయమైంది. సుమారు 12 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించిన ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3న తన బాధ్యతలను రామన్ లగార్తాకు అప్పగిస్తారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్గా ఉన్న లగార్తా కంపెనీలో 22 సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఐరోపాతోపాటు ఆఫ్రికా సహారా డివిజన్లో ఆయన కంపెనీ ఈసీఓగా వ్యవహరించారు. అపారమైన అనుభవం ఉన్న లగార్తాను సీఈవోగా నియమించాలని కంపెనీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. కాగా, 62 ఇంద్రా నూయి పెప్సీ కంపెనీకి 24 సంవత్సరాలు అత్యుత్తమ సేవలు అందించారు. 2006లో సీఈఓగా బాధ్యతలు చేపట్టి కంపెనీ ముఖ చిత్రాన్నే మార్చేశారు. ఆమె మార్గదర్శకంలో పెప్సీ కొత్త పుంతలు తొక్కింది. భారత మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది.













