అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడుతున్న విదేశీ-అమెరికా పౌరులు
ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ప్రజల సంఖ్య బాగా పెరిగినట్లు తెలిసింది.UK నిర్వాసితులు, యుఎస్ ప్రవాస పన్ను మరియు ఇతర సంబంధిత విషయాలలో ప్రత్యేకత కలిగి ఉన్న న్యూయార్క్ సంస్థ బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్ ప్రతి త్రైమాసికంలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ఆధారంగా 2020 లో గడిచిన మొదటి 6 నెలలలో షుమారుగా 5,800 మందికి పైగా తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకో గా, 2019 లో మొత్తం 2,072 మంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదిలివేసినట్లు బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్ ప్రకటించింది.
ఇంత భారీ సంఖ్యలో ప్రజలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ పై మరియు ప్రస్తుతం అమెరికా రాజకీయ విధానాల పై అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించే తీరే కారణం అని మరియు ఈ సంఖ్య నొవెమ్బెర్ లో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అద్ధ్యక్షులు అయితే మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు అని బాంబ్రిడ్జ్ తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.













