డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమర్శలు
అనధికారిక వలసదారుల సంతానానికి పౌరసత్వ హక్కును రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో జన్మించే వలసదారుల చిన్నారులకు ఇచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో తొలగించలేరని కాంగ్రెస్ సభ్యుడు, ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రేయాన్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో వలస చట్టాలను మార్చాలని ప్రయత్నించినప్పుడూ దానిని తాము ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. తమకు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని రేయాన్ తెలిపారు.













