అమెరికా రక్షణ మంత్రిగా ప్యాట్రిక్ షానహన్
అమెరికా రక్షణ మంత్రిగా జిమ్ మాటిస్ స్థానంలో ఆయన సహాయకుడు ప్యాట్రిక్ షానహన్‌ను నియమించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పలు విధానపరమైన అంశాలపై ట్రంప్‌తో విభేదించిన మాటిస్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) చీఫ్‌గా షానహన్‌ను నియమించనున్నట్టు ట్రంప్ తెలిపారు. షానహాన్ నియామకం 2019, జవనరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. షానహన్ ప్రస్తుతం రక్షణశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఆయన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌లో పనిచేశారు.













