ఒక్క ఐడియా..వందల కొద్దీ జాబ్ ఆఫర్లు!
ఏదారీ కనిపించకపోతే మనమే ఓ దారిని కనుక్కోవాలన్నది ఫ్లోరిడాకు చెందిన ప్యాట్రిక్ హోగ్లండ్ సిద్ధాంత. ఆయనకు 30 ఏళ్లు. ఒక బిడ్డకు తండ్రి కూడా. దురదృష్టవశాత్తూ ఉద్యోగం పోవడంతో మరో కొలువు కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. కంపెనీలకు రెజ్యూమెలు పంపించాడు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో అరిజోనాలోని కేమెల్బ్యాక్ చౌరస్తాలో ఓ మూల నుంచొని.. ప్లీజ్ రెజ్యుమె తీసుకోండి. ఉద్యోగం పోయిన వ్యక్తిని. కొలువు కోసం చూస్తున్నా అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. అయితే, ఆయనకు ఉద్యోగ ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. బాగా ఆలోచించి చివరకు ఓ కాంక్రీట్ గ్రైండింగ్ సంస్థలో కొలువు చేయడానికి అంగీకరించాడు ప్యాట్రిక్.













