భారత్-వర్జీనియా బిజినెస్ సమావేశం….
కరోనా మహమ్మారి భారత్‌ను ఆర్థిక సంస్కరణల బాట నుంచి తప్పించ లేదని అమెరికాలో భారత్ రాయబారి తరణ్‌జిత్ సింధూ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక సంస్కరణల నుంచి అమెరికా వ్యాపారవేత్తలు ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. కార్మిక, అంతరిక్ష, వ్యవసాయ రంగాల్లో కేంద్రం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య-సీఐఐ నిర్వహించిన భారత్-వర్జీనియా బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, కొద్ది మినహా దాదాపు ప్రతి రంగంలోనూ విదేశీ పెట్టుబడులకు భారత్ పెద్దపీట వేస్తోందని అన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వ్యాక్సిన్ అభివృద్ధి, శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లోనూ భారత్-అమెరికాల స్నేహ సహకారాలు విస్తరించిందన్నారు. వర్జీనియా గవర్నర్ రాల్ఫ్ నార్తం కూడా సమావేశంలో పాల్గొన్నారు.













