తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డితో పాలపిట్ట పుస్తకావిష్కరణ
తెలంగాణ పార్లమెంట్ నాయకుడు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ లీడర్ కృష్ణ సాగర్ రావ్, అమెరికా తెలంగాణ సంఘం కార్య వర్గం, మరియు తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన కళాకారుల సమక్షం లో, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి గారు పాలపిట్ట అనే ప్రవాస తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక సంచికను జూన్ 2, 2018 న హౌస్టన్ లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలంగాణ మహా సభల సందర్గంగా ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో రైతే రాజు, సినారే ఘన నివాళి, నాలుగేళ్ళ తెలంగాణ, హౌస్టన్ తెలుగు భవనం, బోనాలు, బతుకమ్మ పండుగ, తెలంగాణం తో పాటు మరెన్నో విశేషాంశాలు పొందుపరిచారు. ఈ పుస్తక ప్రచురణకు ప్రొఫెసర్ సాంబ రెడ్డి ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు.













