ఇమ్రాన్ – ట్రంప్ భేటీ
అమెరికా, పాకిస్థాన్ మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్నదే తమ లక్ష్యమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రధానిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికాకు వచ్చారు. నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పాక్ దౌత్య కార్యాలయంలో బసచేస్తున్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్రంప్‌తో జరిగే భేటీలో తాము ఉగ్రవాదంపై పోరు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలను వివరించటంతో పాటు పాక్ భూభాగం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై తీసుకుంటున్న చర్యలు, తాలిబన్లతో శాంతి చర్చలకు చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్ వివరించనున్నారని పాక్ దౌత్యకార్యాలయ వర్గాలు తెలిపాయి.













