పాక్ మారకుంటే తీవ్ర నష్టం: అమెరికా
ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌ను ఉగ్రవాద వేగంగా గుర్తిస్తున్నట్లు తక్షణం ప్రకటించాలని, ఈ మేరకు యుఎస్ కాంగ్రెస్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సెనెటర్ టెడో పోయ్ డిమాండ్ చేశారు. పాక్‌కు అందిస్తున్న సైనిక సాయాన్ని నిలిపివేయాలని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు రానున్నాయని అభిప్రాయపడ్డ టెడ్ పాక్ మారకుంటే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. వారికి సైనిక సాయాన్ని ఆపండి. డబ్బులివ్వడాన్ని ఆపండి. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశమని ప్రకటించండి అని ఆయన కోరినట్లు పీటీఐ తెలియజేసింది. చాలా మంది అమెరికన్లకు పాక్ గురించి పూర్తి సమాచారం తెలియదని టెడ్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అత్యంత సుదీర్ఘ యుద్ధం ఉగ్రవాదులతో జరుగుతోందని, పాక్‌ను నిలువరిస్తే, ఇది మరింత సులువు అవుతుందని చెప్పుకొచ్చారు.













