ఆ దేశం అత్యంత ప్రమాదకరం : మాటిస్
జమ్ముకశ్మీర్ అంశంలో భారత్‌ను దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌కు తనపై పడిన ఉగ్రవాద దేశం అనే ముద్రను చెరిపేసుకోవడం సాధ్యపడట్లేదు. అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ తాజాగా ఆ దేశం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమని, ఆ దేశంలో అణ్వాయుధాలు పెరిగిపోతున్నాయని మాటిస్ పాక్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రజల బాగోగులు, దేశ భవిష్యత్తును పట్టించుకునే నేతలు ఆ దేశంలో ఎవరు లేరని ఆయన దుయ్యబట్టారు. ”కాన్ సైన్ చావోస్ లెర్నింగ్ టు లీడ్” పేరుతో తాను రాసిన పుస్తకంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ పుట్టుకతోనే తన గడ్డపై తనకు ప్రేమ, ఆప్యాయత లేకుండా ఉనికిలోకి వచ్చింది. అక్కడి రాజకీయ సంస్కృతిలో స్వీయ విధ్వంసం అనేది ఒక పెడధోరణిగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకూ నేను కలిసి పనిచేసిన దేశాలన్నిటిలో పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే, మతోన్మాదాన్ని వ్యాప్తి చేస్తూ ఆ దేశం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది. విచ్చలవిడిగా అణ్వాయుధాలను పోగు చేసుకుంటున్నది. ప్రజల బాగోగులు, దేశ భవిష్యత్తును పట్టించుకునే నేతలు ఆ దేశంలో ఎవరూ లేరు అని మాటిస్ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై గతంలో పాక్‌కు తాను చేసిన హెచ్చరికలను కూడా మాటిస్ తన పుస్తకంలో ప్రస్తావించారు.













