డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ప్రధాని భేటీ
పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలే తమ విదేశాంగ విధానమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్, పాక్ మధ్య సత్సబంధాలు ఇరుదేశాలకు ప్రయోజనకరమన్నారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కశ్మీర్ సహా భారత్, పాక్ మధ్య అపరిష్కృత సమస్యలను చర్చల ద్వారా పరిష్కారానికి సిద్ధమన్నారు. ఆసియాలోని దేశాలు సోదరభావంతో ముందుకుసాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. దీంతో ట్రంప్ కలుగచేసుకుంటూ కశ్మీర్‌పై పరిష్కారంలో చొరవకు తాను సిద్దమేనని తెలిపారు.













