50 కోట్ల బాండ్ పై విడుదలైన పద్మశ్రీ రాజేంద్ర బోత్రా
అమెరికా హెల్త్‌కేర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న పద్మశ్రీ రాజేంద్ర బోత్రా 50 కోట్ల బాండ్‌పై విడుదలయ్యారు. పద్మశ్రీ రాజేంద్రతో పాటు మరో అయిదుగురు 3300 కోట్ల హెల్త్‌కేర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా చరిత్రలో ఇదే పెద్ద ఫ్రాడ్‌గా రికార్డు అయింది. అయితే 77 ఏళ్ల భారత సంతతి డాక్టర్ రాజేంద్ర మాదకద్రవ్యాలను విపరీతంగా అమ్మారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ రాజేంద్ర భారీ మొత్తంలో సొమ్మును దాచిపెట్టారని కూడా ఆయనపై కేసు నమోదు అయ్యింది. రాజేంద్రను విడుదల చేయకూడదని పిటీషన్ల వేసినా, జిల్లా జడ్జి స్టీఫెన్ మర్ఫీ మాత్రం భారత సంతతి డాక్టర్‌కి విముక్తి కల్పించారు. డాక్టర్ రాజేంద్రను రిలీజ్ చేసినా, ఆయన్ను జీపీఎస్ ట్రాకర్ ద్వారా నిత్యం ట్రేస్ చేయనున్నారు.













