ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతుల పాదపద్మములకు పాద పూజ కార్యక్రమం
అమరావతిలో ఏకైక రాజధానిగా కొనసాగించాలని సంవత్సర కాలంగా నిర్విరామంగా పోరాటం చేస్తున్న అమరావతి రాజధాని రైతులకు ఎన్నారై టీడీపీ నాయకులు జయరామ్ కోమటి గారి ఆధ్వర్యంలో అమరావతి యువజన జెఎసి కన్వీనర్ రాయపాటి సాయికృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణ, మూల్పూరి సాయి, కళ్యాణి తదితరులు రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, అనంతపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల్లోని రైతుల పాదపద్మములకు పాద పూజ కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు.
అనంతరం విదేశాల్లో ఎన్నారైలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజధాని రైతు పోరాట కండువాలు పంపిణీ చేశారు.













