పాఠశాల విద్యార్థులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఎన్నారై పిల్లలకోసం రూపొందించిన సిలబస్‌తో అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను ‘పాఠశాల’ వివిధ ప్రాంతాలలో చిన్నారులకు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పాఠశాలలో ఇటీవలనే 4 సంవత్సరాల తెలుగు కోర్సును దాదాపు 40 మంది విద్యార్థులు పూర్తి చేశారు. మే 19-20 తేదీల్లో వీరికి తుది పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బే ఏరియాలో జూన్ 3వ తేదీన జరిగే వసంతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లను, మెడల్స్ ను బహుకరించనున్నారు.













