వివిధ నగరాల్లో ఘనంగా ‘పాఠశాల-తానా’ తెలుగు పోటీలు
అమెరికాలో ఉంటున్న తెలుగు చిన్నారుల్లో మాతృభాషపై మక్కువ పెంచడానికి వారిలోని తెలుగు భాషా వైభవాన్ని వెలికితీసేందుకోసం అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కలిసి తెలుగు పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాస్ఏంజెల్స్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, మిన్నెసొటాలో తెలుగు పోటీలను నిర్వహించారు. ఈ నగరాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులను కూడా అందించారు.
సౌత్ కాలిఫోర్నియాలో జరిగిన పోటీలను వాణి కందిపతి, శిరీష అల్లాని పర్యవేక్షించారు. ఫిలడెల్ఫియాలో జరిగిన పోటీలను లక్ష్మీ ముద్దన, నాగరాజు నలజుల, సాయి జరుగుల చూశారు. అట్లాంటాలో జరిగిన పోటీలకు భరత్ మద్దినేని, మిన్నెసొటాలో జరిగిన పోటీలకు వెంకట్ తోట, కనెక్టికట్లో జరిగిన పోటీలకు రావు యలమంచిలి, లక్ష్మీనారాయణ అనపర్తి, బబిత అడప పర్యవేక్షించారు.













