మొదలు అయిన పాఠశాల తానా తెలుగు పోటీలు 2019
కొలంబస్ ఒహయో లో పాఠశాల డైరెక్టర్ శ్రీ కాళీ ప్రసాద్ మావులేటి నిర్వాహణలో, ఆ పట్టణం లో వున్నా తానా నాయకుల సహాయ సహాకారాలతో “పాఠశాల తానా తెలుగు పోటీలు 2019” శనివారం మే 4 వ తేదీ న మొదలు అయ్యాయి.
వచ్చే వారం నుంచి వరసగా ఒకటి లేదా రెండు చోట్ల ఈ పోటీల నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక చోట్ల నుంచి పోటీలు నిర్వహించటానికి ముందుకు వస్తున్న పాఠశాల, తానా మరియు తెలుగు అభిమానులకు మా ధన్యవాదాలు.
ఈ పోటీలు నిర్వహించటానికి కొన్ని వివరాలు ఇస్తూ ఎక్కువ చోట్ల జరపటానికి మేము సిద్ధం గా ఉన్నామని అందరికి పాఠశాల తానా ల తరుపున తెలియ చేస్తున్నాం.
1. మీ ప్రాంతం లో తెలుగు చిన్నారుల కోసం ఈ పోటీలు నిర్వహించాలనుకొనే వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
www.paatasala.net/telugupoteelu
2. మీరు పోటీలు జరపటానికి ఒక ప్లేస్ (ఓ స్కూల్ గాని, ఓ టెంపుల్ గాని, ఓ ఆఫీస్ గాని), ఒక తేదీ (జూన్ చివరి వరకు వున్న శని లేదా ఆదివారం లలో) నిర్ణయించి మాకు తెలియ చేయండి.
3. పాఠశాల, హైదరాబాద్ ఆఫీస్ వెంటనే మీ వూరికి తెలుగు పోటీల పోస్టర్ ని, పాంఫ్లెట్ ని, ఈ ఫ్లయర్ ని తాయారు చేసి పంపుతుంది. అలా వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ తో పబ్లిసిటి మొదలు పెట్టటమే! ఈ ఫ్లయర్ ని FB ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇమెయిల్ ద్వారా మీ ఊరిలోని అన్ని గ్రూప్ లకు పంపి ఎక్కువ మంది పిల్లలు రిజిస్టర్ అయ్యేలా చేయండి.
4. హైదరాబాద్ నుంచి పోటీలలో పాల్గొనే సర్టిఫికెట్స్, గెలిచిన వారికి ఇచ్చే ట్రోపీలు, కావలిసిన ఫ్లెక్స్ బ్యానెర్లు అన్నిమీకు పంప బడుతాయి.
తెలుగు భాష కి అభిమాని గా, తానా సభ్యుని గా మీరు మీ ఊరి పిల్లల తెలుగు భాష నైపుణ్యాన్ని గుర్తించేలా చెయ్యండి.













