‘పాఠశాల’ విద్యార్థిని కుసుమకు మొదటి బహుమతి
నాగ్‌పూర్‌లోని సరస్వతీ విద్యాలయంలో భారతమాత గొప్పదనంపై జరిగిన అంతర్రాష్ట్ర భాషా పోటీల్లో ‘పాఠశాల’ విద్యార్థిని కుసుమకు మొదటి బహుమతి లభించింది. 125వ వేడుకలను పురస్కరించుకుని సరస్వతీ విద్యాలయం ఈ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ పోటీల్లో కుసుమ తెలుగులో భారతమాత గొప్పదనాన్ని గొప్పగా చెప్పి అందరి అభినందనలను అందుకుంది. దాంతో ఆమెకు మొదటి బహుమతి లభించింది. ఈ పోటీల్లో నాలుగు పాఠశాలలు పాల్గొన్నాయి. తెలుగు భాష గొప్పదనాన్ని నాగ్‌పూర్‌లో నివసించే కుసుమ చెప్పడంతో ఆమెను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా అక్టోబర్‌లో ఆమెను సన్మానిస్తున్నట్లు ఆంధ్రఅసోసియేషన్ తరపున పిఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.













