ఫ్రీమాంట్ లో ‘పాఠశాల’ తరగతులు ప్రారంభం
గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నారై తెలుగు చిన్నారులకు మాతృభాష తెలుగును నేర్పిస్తున్న ‘పాఠశాల’ దిగ్విజయంగా 2017-18 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో జరిగిన ప్రారంభ దిన వేడుకల్లో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి పాల్గొని పాఠశాల విద్యాబోధనపై ప్రసంగించారు. ఎన్నారై పిల్లలకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలుగు పలుకు’ కోర్స్‌ను పాఠశాలలో బోధిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర విద్యాశాఖతో కలిసి వారు సూచించిన సిలబస్‌తో, కొత్తగా అచ్చుపుస్తకాలను కూడా ముద్రించామని, తెలుగును సులభంగా వేగంగా నేర్చుకునేలా బోధన ఉంటుందని చెప్పారు. ఎన్నారై తెలుగు కుటుంబాల్లోని పిల్లలంతా పాఠశాలలో చేరి మాతృభాష తెలుగును నేర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏరియా డైరెక్టర్ లు ప్రసాద్ మంగిన, రమేష్ కొండతో పాటు పాఠశాల టీచర్లు, రజనీకాంత్ కాకరాల తదితరులు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో చిన్నారులు ఈ ప్రారంభ దిన వేడుకల్లో పాల్గొనడం విశేషం.
Paatasala Admission details please visit : www.paatasala.net













