ఆరు నెలల్లో కరోనా తొలి వ్యాక్సిన్
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్గానీ అందుబాటులో లేదు. కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు తలమునకలైవున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన అంశాన్ని ప్రకటించింది. నయం చేయలేని ఈ వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో వ్యాక్సిన్ తయారు చేయగలమంటూ నమ్మకంగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించారు.













