చికాగోలో ఆస్కార్ విజేత చంద్రబోస్ కి ఘన సన్మానం
చికాగో మహానగరం లో సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ గారి కి 20 పైగా ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు నపేరువిల్లే లో మాల్ అఫ్ ఇండియా లో జూన్ 11 వ తారీఖున ఎంతో ఘనంగా సత్కరించారు. దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. సంస్థలన్నీ కలసి చంద్రబోస్ గారిని మంగళ హారతితో మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. చంద్ర బోస్ గారిని ప్రేక్షకులు నిల్చొని కరతాళ ధ్వనులతో రెడ్ కార్పెట్ మీద వేదికకు ఆహ్వానించారు.
తెలుగు సంఘ ప్రతినిధుల నడుమ ఆటా వ్యవస్థాపకుడు హనుమంత్ రెడ్డి గారు చంద్రబోస్ గారిని ఘనంగా సన్మానించారు. ఆటా, తానా, అమెరికా తెలుగు సంఘం, ఆప్త, నాటా, నాట్స్, నివ, టీడీఫ్, సిలిసిన్ ఆంధ్ర మనబడి, టి.ఆ.జి.సి., టి.టి. ఏ, సి.ఏ ఏ, చితా, తదితర సంఘాల ప్రతినిధులు తమ సంస్థ తరపున చంద్రబోస్ గారి ఘనంగా సన్మానించారు.
చంద్రబోస్ గారు మాట్లాడుతూ గంటకి పైగా తెలుగు సంఘాలు అన్ని కలిసి తనకు సన్మానం చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తెలుగు బాషా ఒక్క తియ్యదనం, ప్రాశస్త్యం గురించి వివరించారు, అవసరం, ఆవశ్యకత ఉన్నప్పుడు అందరు ఏకం అవుతారు అని ఆస్కార్ నిరూపించటం చాలా ఆనందదాయకం అన్నారు. చంద్ర బోస్ గారు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వయస్సుల వారితో కిక్కిరిసిపోయిన ఆడిటోరియం ప్రాంగణం, చంద్రబోస్ గారి మాటలకు హర్షాతిరేకల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది.
ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన వారు సాయినాథ్ రెడ్డి బోయపల్లి, భాను స్వర్గం, రత్నాకర్ రెడ్డి అర్జుల, సుచిత్రారెడ్ది, మహీధర్ ముస్కుల, వెంకటరామ్, మాలతి దామరాజు, గౌరీ శంకర్ అద్దంకి, సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల, కరుణాకర్ మాధవరం, హేమ కానూరు, కృష్ణమోహన్ చిలంకూరు, పరమేశ్వర్ ఎర్రసాని, సత్య తోట, రమేష్ తూము, నివాస్ పెదమల్లు, హేమచంద్ర వీరపల్లి ఓరుగంటి, అశోక్ పగడాల, అమర్ నెట్టెం, హను చెరుకూరి, నివాస్ పాల్తేపు, నగేష్ దూలం, ఉమా కటికి, సుజాత అప్పలనేని, హరిణి మేధా, శ్వేతా కొత్తపల్లి, శిరీష మద్దూరి, వాసవి చక్క. ఆస్కార్ విజేత చంద్రబోస్ గారి కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేందుకు ఎంతో తోడ్పాటుని అందించిన వివిధ సంఘాల ప్రతినిధులకు నిర్వహకులకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబోస్ గారి గౌరవార్థం, స్థానిక కళాకారులు, చిన్నారులు ఆయన వ్రాసిన పాటలతో సంగీత, నృత్య కార్యక్రమాలు చేసి ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్న ప్రణతి కలిగొట్ల, మాధురి హరి ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు. ఆస్కార్ నేపథ్యంలో రవి తోకల చేసిన వేదికాలంకరణ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ప్రవీణ్ జలిగామ, రవి తోకల, మణి తెల్లాప్రగడ, మాధురి హరి, భాను లావణ్య అరసాడ, మహేష్ కుమార్, చిరంజీవి అఖిల అర్జుల లు తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను వినోదపరిచారు. మూడు గంటలకి పైగా జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్స్ సందడి చేసారు.













