ఆ డీఎన్ఏ నాలో లేదు : ఓప్రా
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఓప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాలో ప్రస్తుత పాలనా వ్యవస్థ సరిగ్గా లేదని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. ఇటీవల ఇన్స్టైల్ మ్యాగజైన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఓప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2020 ఎన్నికల గురించి ప్రస్తావించారు. నేను ఏం చేయగలను, ఏం చేయలేను అన్న విషయాల్లో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నేను కాన్ఫిడెంట్గా ఉంటనే ఏ పనైనా చేస్తా. అధ్యక్ష పదవిపై నాకు అంత ఆసక్తి లేదు. ఆ డీఎన్ఏ నాలో లేదు అని తెలిపారు.













