అమెరికాలో వారం రోజుల కింద ఘటన మరువకముందే… మరోసారి
అమెరికాలో వారం రోజుల కింద ఆరుగురి ప్రాణాలు బలిగొన్న బాల్టిమోర్ వంతెన ప్రమాదాన్ని మరిచికపోకముందే అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఓక్లహామాలోని ఆర్కన్సాస్ నదిపై ఉన్న వంతెనను ఓ బార్ట్ ( భారీ వాహనాలను తరలించే పడవ ) ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానిక పెట్రోలింగ్ బృందాలు సాల్లిసా హైవే దక్షిణ భాగాన్ని మూసివేసి, రాకపోకలను వేరే దారిలోకి మళ్లించాయి. ఈ ప్రమాదంలో బార్జ్ దెబ్బతినగా, వంతెన పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు.







