జీ-4 దేశాల సమావేశంలో పాల్గొన్న సుష్మ స్వరాజ్
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వారాజ్ తీరిక లేకుండా పలువురు నేతలను కలుస్తున్నారు. ఆమె ఫిజి, ఇస్టోనియా, సురీనామ్ దేశాల నేతలకు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సమకారం, మద్దతుపై ఆమె చర్చించారు. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరమాతో పాటు ఇస్టోనియా విదేశాంగ శాఖ మంత్రి స్వెన్ మిక్సెర్, సురీనామ్ విదేశాంగ మంత్రి డెబొరా పొలాక్ బీగ్లేతోనూ ఆమె చర్చలు జరిపారు. ఈ దేశాలతో చారిత్రక ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నట్టు సుష్మా తెలిపారు. ఆయా దేశాల నేతలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు.













