వాజ్ పేయి మృతిపట్ల తానా, టాటా, ఆటా, నాట్స్ సంతాపం
మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అటల్ బీహారీ వాజ్పేయి మృతిపట్ల అమెరికాలోని పలు తెలుగు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా), ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)తోపాటు ఆటా తెలంగాణ, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్, లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా), శాక్రమెంటో తెలుగు సంఘం ఇతర సంఘాలు ఓ ప్రకటనలో వాజ్పేయి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. దేశానికి ఆయన చేసిన సేవలు మరువరానివని, అదేసమయంలో రాజనీతిని పాటించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని కీర్తించాయి.













