మార్పు కోసం ఓటు వేయండి : ఒబామా
నవంబర్లో జరిగే ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయమని 2020 గ్రాడ్యుయేట్లకు అమెరికా మాజీ అద్యక్షులు ఒరాక్ ఒబామా విజ్ఞప్తి చేశారు. సుమారు రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న నిరసనలు మాత్రమే వివక్షను, అన్యాయాన్ని అంతం చేయలేవని అన్నారు. యుట్యూబ్ ద్వారా ఒబామా ప్రసంగిస్తూ ఇప్పటికే బద్దలైనట్లుగా కనిపిస్త్ను అమెరికా ప్రజాస్వామ్యంలో దేశ యువత తమ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివక్షను అంతం చేయడానికి ప్రత్యక్ష చర్య, శాసన ఉల్లంఘనతో పోలిస్తే ఓటు వేయడం ఎంత ఉపయోగకరంగా ఉంటుందని కొంత మంది యువకులు చర్చించుకోవడం నా దృష్టికి వచ్చిందని ఒబామా తెలిపారు. నిజం చెప్పాలంటే, రెండింటిలో ఒకటిని మనం ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు రెండూ అవసరమే అని అన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం తీరును ఒబామా విమర్శించారు. గత నెలలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఒబామా మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొంటున్నట్లు ట్రంప్ ప్రభుత్వంలో కనీసం ఎవ్వరూ నటించడం కూడా లేదని విమర్శించారు. అలాగే, పోలీసుల క్రూరత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై సామాజిక మీడియాల్లో సదీర్ఘమైన పోస్టులనూ ఒబామా ఉంచారు.













