చికాగోలో ఘనంగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ – 4వ మినీ మహానాడు!
చికాగోలో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ యుఎస్ఎ విభాగం ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నాలుగో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి యుఎస్ఎ కో ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పెద్దఎత్తున దాడులకు దిగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లేదీసే పరిస్థితి నెలకొంది. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, సమాజాన్ని జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత, ప్రాంతాల పరంగా విభజించి పాలిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని చికాగో టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు సమన్వయ పరచగా, సిటీ టీడీపీ నాయకులు రవి కాకర, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, చిరంజీవి గళ్ళ, కృష్ణ మోహన్, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీ హరి కట్టా, ప్రవీణ్ వేములపల్లి, మదన్ పాములపాటి, మహేష్ కాకరాల, వినోజ్ చనుమోలు, లక్ష్మణ్ తదితర నాయకులు కార్యక్రమం విజయవంతం అవ్వడంలో సహకరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు రామ కోటేశ్వర రావు కాట్రగడ్డ, శ్రీలత గరికిపాటి, చాందిని దువ్వూరి, వాసవి చక్క, దేవి ప్రసాద్ పొట్లూరి, యుగంధర్ నగేష్ కాండ్రేగుల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సహంగా పాల్గొన్న పార్టీ అభిమానులందరికి పేరు పేరున జయరాం కోమటి కృతజ్ఞతలు తెలియజేసారు.













