ఆస్టిన్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఆదివారం Austin-Texas లో జరిగినాయి. ఈ సంబరాలకు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కుటుంబ సమేతంగా 450 మంది సభ్యులతో సాంసృతిక, సాహిత్య నృత్యాలు అలాగే స్వరాంజలి టీం పాడిన పాటలు ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమానికి అతిధి గా టీడీపీ NRI విభాగం కన్వీనర్ కోమటి జయరాం గారు పాల్గొని సభని ఉద్దెశించి ప్రసంగించారు. అన్నగారిని స్మరించుకుంటూ, అయన తలపెట్టిన వినుతున్న నిర్ణయాలు అలాగే అయన ఆశయ సాధనాలు… రాబోయే తరానికి వివరిస్తూ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆస్టిన్ టీడీపీ టీం ప్రతి ఒకరు పేరు పేరున స్వచ్చంధంగా కృషిచేసి ఘనవిజయంగా ముగించారు.













