TANA: తానా 24వ కాన్ఫరెన్స్‌లో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏవీ
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ (NTR) ను తానా 24వ మహాసభల్లో గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆ మహానాయకుడి జీవితంలోని కీలక అంశాలను నేటి తరానికి తెలియజేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్టీఆర్ వేసిన విభిన్న పాత్రలకు సంబంధించిన వీడియో ఫుటేజీని చూసిన పెద్దలందరికీ ఆ మహానుభావుడు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. యువతరం అంతా తెరపై కనిపించిన అద్భుతమైన నటనాకౌశలాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ మహానుభావుడిని మరోసారి ఇలా అందరికీ గుర్తుచేసిన తానాకు పలువరు ధన్యవాదాలు తెలియజేశారు.







