ఎన్నారైవీఏ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం పలు సేవా కార్యక్రమాలకు ఎన్నారైవీఏ సృజన, సేవ బృందాలు శ్రీకారం చుట్టాయి. ఉత్తర అమెరికా, భారత్ రెండు దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్నారైవీఏ సృజన కమిటీ చైర్ సుప్రియ దండ, సేవ కమిటీ చైర్ స్వామి బొగ్గారపు తమ తమ బృందాలతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నారైవీఏ సెక్రటరీ టీం, ట్రెజరరీ టీం, బీఓటీ సభ్యులు సునీత రాచపల్లి, లక్ష్మణ్ కాపర్తి కూడా ఈ కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పెనుగొండ ప్రభుత్వాస్పత్రిలోని పేద గర్భిణీలకు ఎన్నారైవీఏ బృందం నుంచి దుప్పట్లు, దిండ్లు, ఆహారం అందజేస్తున్నారు. అలాగే అనంతపురంలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సేవ చేశారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్లోని వాసవీ కుటీర్ వృద్ధాశ్రమం, అనకాపల్లిలో పలుచోట్ల ఆహార పదార్థాలను అందించారు.
ఇక అమెరికాలో మహిళల హిస్టరీ మాసాన్ని సెలబ్రేట్ చేయాలని ఎన్నారైవీఏ నిర్ణయించింది. దీనిలో భాగంగా మార్చి నెల మొత్తం పలు సిటీల్లో ఎన్నారైవీఏ సృజన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 3 – డల్లాస్
మార్చి 9 – లాస్ ఏంజెలిస్
మార్చి 15 – రాలీ
మార్చి 17 – డెలవేర్
మార్చి 9 – బోస్టన్
మార్చి 10 – ఫిలడెల్ఫియా
మార్చి 9 – కొలంబియా, సౌతర్న్ కాలిఫోర్నియా
మార్చి 23 – షార్లట్, నార్తర్న్ కాలిఫోర్నియా
మార్చి 30 – టంపా, ఫ్లోరిడా
మార్చి 17 – మేరిల్యాండ్,
మార్చి 10 – కొలరాడో
మార్చి 16 – హ్యూస్టన్
మార్చి 17 – మిల్వాకీ
ఏప్రిల్ 28 – వర్జీనియా
మార్చి 30 – అట్లాంటా
మార్చి 23 – సెయింట్ లూయిస్
మార్చి 10 – మెంఫిస్
మార్చి 16 – రిచ్మాండ్
ఏప్రిల్ 5 – ఆస్టిన్
మార్చి – 30 కనెక్టికట్
శాన్ ఆంటోనియో – తేదీ ఖరారు కాలేదు







