ఎన్నారై వాసవీ గ్లోబల్ కన్వెన్షన్
ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ గ్లోబల్ కన్వెన్షన్ చికాగోలోని షుంబర్గ్ రినేసాన్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు ఈ గ్లోబల్ కన్వెన్షన్ జరుగుతుంది. ప్రపంచంలోని వాసవీలందరూ ఈ గ్లోబల్ కన్వెన్షన్‌కు వస్తున్నందున ఈ వేడుకలకు అందరూ తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ గ్లోబల్ కన్వెన్షన్ ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బిజినెస్ కాన్ఫరెన్స్, యూత్ కాన్ఫరెన్స్, ఉమెన్ కాన్ఫరెన్స్, బాంక్వెట్ నైట్, కల్చరల్ మెగా మ్యూజికల్ నైట్, మిస్ అండ్ మిసెస్ ఎన్ఆర్ఐవిఎ, మాస్టర్ అండ్ మిస్టర్ ఎన్నారైవిఎ, శతమానం భవతి, టాలెంట్, ఆధ్యాత్మిక ప్రదర్శన, మేట్రిమోనీ, స్టాక్స్ అండ్ ఈక్విటీ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఎన్నారై విఎ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా హరిరైని వ్యవహరిస్తున్నారు. చైర్మన్‌గా డా. జయసింహ సుంకు ఉన్నారు.
ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ
హరి రైని (ప్రెసిడెంట్), శ్రీనివాసరావు పందిరి (ప్రెసిడెంట్ ఎలక్ట్), నాగేందర్ ఐత (పాస్ట్ ప్రెసిడెంట్), రవి ఇల్లెందుల (జనరల్ సెక్రటరి), దినకర్ కరుమూరి (ట్రెజరర్), మిసెస్ ఛాయా సెట్టి (జాయింట్ సెక్రటరీ), రాజేశ్ బాదం (జాయింట్ సెక్రటరీ), గంగాధర్ ఉప్పల (జాయింట్ ట్రెజరర్), వెంకట్ బెల్దె (జాయింట్ ట్రెజరర్), శ్రీనివాస్ చిటిమల్ల (కల్చరల్ సెక్రటరీ), శ్రీధర్ ఐత (ఇసి మెంబర్), ప్రశాంత్ గుప్త (ఇసి మెంబర్), కిశోర్ కొందూరు (ఇసిమెంబర్), రాజా పంపటి (ఇసిమెంబర్), అసోక్ ఇల్లెందుల (ఇసిమెంబర్), ప్రవీణ్ అముదాల (ఇసిమెంబర్), శేఖర్ పేర్ల (ఇసిమెంబర్).













