అమెరికాలో దేవకికి అరుదైన గౌరవం
వాసవీ సత్ర సముదాయాల జాతీయ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లుకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. చికాగోలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారై ఆర్యవైశ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. సమావేశం సందర్భంగా సమావేశం హాలు వేదికపై దివంగత గవర్నర్ కొణిజేటి రోశయ్య, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ల ఫోటోలతో పాటు వాసవి సత్ర సముదాయాల జాతీయ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు ఫోటో కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చికాగోలో జరుగుతున్న ఎన్ఆర్ఐ వాసవి అసోయేషన్ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు కొణిజేటి రోశయ్య, టీజీ వెంకటేష్ చిత్రపటాలతో పాటు తన చిత్రపటం కూడా ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాసవి మాత అనుగ్రహంతో ఇలాంటి అరుదైన గౌరవం దక్కిందని దేవకీ ఆనందం వ్యక్తం చేశారు.













