చుక్కపల్లి సీత మృతిపట్ల ఎన్నారైల సంతాపం
ఫీనిక్స్ గ్రూపు డైరెక్టర్ చుక్కపల్లి సతీష్ తల్లిగారు చుక్కపల్లి సీత మృతి పట్ల పలువురు ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలో పలు ఎన్నారై సంఘాలు, తెలుగు అసోసియేషన్లు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే సతీష్ చుక్కపల్లికి అమెరికాలోని ఎన్నారైలతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వివిధ కార్యక్రమాలకు తనవంతుగా సహాయం అందించే సతీష్ చుక్కపల్లికి అన్నీ చోట్లా మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఫీనిక్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ అందరితో కలిసిపోయే మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సతీష్ చుక్కపల్లి తల్లిగారు శ్రీమతి చుక్కపల్లి సీత ఈనెల 20వ తేదీన మరణించారు. పెదకర్మ కార్యక్రమాన్ని 30వ తేదీన గుంటూరులోని కృష్ణనగర్లో ఉన్నవారి స్వగృహంలో నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభంలో కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సతీష్ చుక్కపల్లి తండ్రిగారు భాస్కర్రావు నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.













