అమరావతి కోసం ఇండియన్ కాన్సులెట్ జనరల్ని కలిసిన ప్రవాస ఆంధ్రులు
అమెరికా లోని వివిధ ప్రాంతాలకి చెందిన ప్రవాస ఆంధ్రులు న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తి గారిని కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సమస్య గురుంచి మరియు రైతులు, మహిళల మీద జరుగుతున్న దాడుల గురుంచి వివరించారు. రాజా కసుకుర్తి ఇంతకు ముందు ప్రభుత్వం రైతులకి చేసిన వాగ్దానాలని మరియు ప్రమాణాలని ఇప్పటి ప్రభుత్వ్యం ఎలా పట్టించుకోవట్లేదు వివరించారు. పద్మ చావా అక్కడ మహిళలు మరియు రైతుల పైన జరుగుతున్న దాడుల్ని వివరించారు.
బాల సుబ్రహ్మణ్యం రాయుడు, పవన్ తాత, విష్ణు కనపర్తి మరియు నాయుడు ఈర్ల మాట్లాడుతూ ఈ అనాలోచిత నిర్ణయాల వలన అక్కడ బలహీన వర్గాలు, మధ్యతరగతి మరియు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు.
శ్రీహరి మాందాటి, రాధా, కార్తీక్, వంశీకృష్ణ, రామకృష్ణ , రమేష్ తదితరులు కాన్సులెట్ జనరల్ తో మాట్లాడుతూ ఇప్పటి ప్రభుత్వ నిర్ణయాలవలన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టిన జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు భయపడి వెనక్కి పోతున్నారని వివరించారు.
చివరగా ప్రవాస ఆంధ్రులు అందరు కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తి గారికి విజ్ఞాపన పత్రం సమర్పచి భారత కేంద్ర ప్రభుత్వానికి మరియు భారత దేశ అధ్యక్షులకు పంపించవలసినదిగా కోరారు. గౌరవ కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తి గారు ఈ విజ్ఞాపన పత్రాన్ని సంభందిత ప్రభుత్వ కార్యాలయాలకి పంపించి తగు చర్యలు తీసుకొనమని చెపుతాము అని చెప్పినారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగు వారు అందరు తెలుగు వారి సమస్యని అర్ధం చేసుకొని అర్జీని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తునందుకు కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.













