24 దేశాలలో ఎన్నారై టిఆర్ఎస్ శాఖలు
ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎంపీ కవిత సమక్షంలో ఇటలీ, మలేషియా, గల్ఫ్, చైనా, ఒమాన్, కొలంబియా, పరాగ్వే లలో టిఆర్ఎస్ శాఖలు ప్రారంభించబడ్డాయి.
మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ దేశాలలో ఇది వరకే పార్టీ కార్యక్రమాలు చేపట్టుతున్నారు అన్నారు. ఈ ఏడూ దేశాలతో మొత్తమ్ 24 దేశాలలో ప్రారంభించినట్లు అయింది అన్నారు. త్వరలోనే ఈ 7 దేశాల పూర్తి స్థాయి కమిటీ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది కాలంలోనే 24 దేశాలలో శాఖలు ప్రాంభించమని వచ్చే ఏడాది వరకు 50 వరకు పెంచుతామన్నారు. ఉద్యమం నుండి ఎన్నారైలందరం ఎలా అయితే కెసిఆర్ గారి అండగా ఉన్నామో అలాగే భారతదేశం లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి కెసిఆర్ పెట్టె ఫెడరల్ ఫ్రంట్ కి కూడా అండగా ఉంటామన్నారు. ప్రతి దేశంలో ఫెడరల్ ఫ్రంట్ గురుంచి సభలు పెట్టి చర్చ మొదలు పెట్టుతామన్నారు. ఎన్నారైల కోసం ప్రత్యేక సెల్ ఏర్పర్చి 50 కోట్లు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేసారు. ఈ నిధి ముఖ్యంగా గల్ఫ్ భాదితుల సాంక్షేమానికి ఉపయోగపడుతుంది అన్నారు.













