కువైట్ లో టీఆర్ఎస్ రక్తదాన శిబిరం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రవాస టీఆర్ఎస్ కువైట్ తరపున నివాళులర్పించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గోడిశాల మాట్లాడారు. కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్రంగా కలత చెందామని మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కాశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయి నేపథ్యంలో కువైట్లో జరపాల్సిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రద్దు చేస్తున్నామని తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.













