డిట్రాయిట్ లో హరికృష్ణకు ఘనంగా నివాళులు
డిట్రాయిట్లో ఉన్న నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అరోమా ఇండియన్ రెస్టారెంట్ లో సమావేశమై ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికష్ణకుఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డా. బండ్లమూడి హనుమయ్య, డా. బిక్కిన శాయి రమేష్. కంచర్ల రామక ష్ణ. సినీ నిర్మాత యెర్నేని నవీన్, గోగినేని శ్రీనివాస్, చుక్కపల్లి ప్రసాద్, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జి.యమ్.యల్. ప్రసాద్, ద్వారక ప్రసాద్, యు.యన్.బి.రావు, పెద్దిబోయున జోగేశ్వరరావ్, కోనేరు శ్రీనివాస్, తెలుగుదేశం నాయకుడు దాసరి వెంకటేశ్వర రావు తదితరులు హరిక ష్ణతో తమకు గల అనుభవాలను సభికులతో పంచుకున్నారు. తెలుదేశం పార్టీలో నిజమైన కార్యకర్తల మనుగడ కోసం ఆయన చేసిన కషి మరవలేనిదని పేర్కొన్నారు. యార్లగడ్డ శివరామ్ ఈ సభను నిర్వహించారు.













