ఎన్నారై టిడిపి డల్లాస్ ఆద్వర్యంలో ఘనంగా ఎన్.టి.అర్ 23వ వర్ధంతి
ది 01.18.2019 శుక్రవారం అమెరికాలోని డల్లాస్ నగరంలో గల ప్లానో సమావేశమందిరం లో ఎన్నారైలు ఎన్.టి.అర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్నా రై తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఫ్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడని కొనియాడారు. ఎన్.టి .ఆర్ జీవితం అందరికి ఆదర్శపాయమని తాను ఎంచుకున్న అన్ని రంగాలలోను వున్నత శిఖరాలదిరోహంచారని అన్నారు. తెలుగువారి హృదయాల్లో కొలువైన ఎన్.టి.ఆర్ కి డల్లాస్ నగరం లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పార్క్ ని గుర్తించి మిగిలిన ఏర్పాట్లు చేస్తామన్నారు. సినీరంగానికి చేసిన సేవలకు,పేద, బడుగు, బలహీన వర్గాలు మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేసి ఎందరికో రాజకీయ భవిష్యత్ ప్రసాదించిన ఎన్టీఆర్ కి “భారతరత్న” ఇవ్వాలని, దీనికి ముందుగా రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని డల్లాస్ టీడీపీ డిమాండ్ చేసింది.













