డల్లాస్ ఎన్నారై టిడిపి సమావేశంలో మన్నవ సుబ్బారావు

తెలుగుదేశంపార్టీ తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ ఎన్నారై టిడిపి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కీ.శేనందమూరి తారకరామారావు తెలుగువారికి గుర్తింపునిస్తే, ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువారిలో ఆత్మస్టైర్యం కల్పించారన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు విచ్చేసినప్పుడు ప్రవాసాంధ్రులు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. ప్రవాసాంధ్రులు పెట్టుబడులతో పాటుగా జన్మభూమి ఋణం తీర్చుకొనేందుకు కదలిరావాలని కోరారు.
గుంటూరుజిల్లా జిల్లాపరిషత్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అత్యంతవేగంగా, సమర్ధవంతంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టగలచేవ, అనుభవం, దార్శినికత, చిత్తశుద్ధి ఒక్క తెలుగుదేశంపార్టీకే సొంతమన్నారు. ప్రవాసాంధ్రులద్వారా అభివృద్ధికి ఆర్ధిక, వైజ్ఞానిక తోడ్పాటును ఆకాంక్షిస్తుందన్నారు .
డల్లాస్ ఎన్నారై తెదేపా నాయకులు డా.రాఘవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడగల సత్తా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల ఆసరా ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
సమావేశం అనంతరం మన్నవ సుబ్బారావు, వడ్లమూడి పూర్ణచంద్రరావు, జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారులు గోపినేని గోపీచంద్ మరియు రాఘవేంద్ర ప్రసాద్ డల్లాస్ ఎన్నారై తెదేపా ఘనంగా సన్మానించారు.
ఈకార్యక్రమంలో ఎన్నారై తెదేపా నాయకులు మురళివెన్నం, చౌదరిఆచంట, శ్రీనివాస్ కొమ్మినేని, సాంబదొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, జనార్దన్ ఎనికపాటి, రామానాయుడు సూర్యదేవర, అజయ్ గోవాడ, కిశోర్ చలసాని, వేణుపావులూరి, కిరణ్ తుమ్మల, సతీష్ కొమ్మన, సురేష్ మండువ, శేఖర్అన్నే, బాలాజీమాదాల, నవీన్ యర్రమనేని, శ్రీనివాస్ శాఖమూరి, అనిల్ వీరపనేని, ఇంద్రనీల్, వెంకట్ జిల్లెళ్లమూడి, వాసునందిపాటి, బాలు, వెంకట్, అనిల్తదితరులు పాల్గొన్నారు.











































































