బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ మీట్ అండ్ గ్రీట్
మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బూస్టర్ నగరంలో మే నెలలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించినందుకు ఎన్నారై టిడిపి నాయకులందరినీ ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎన్నారై టీడీపీ నాయకులకు పిలుపునిచ్చిచ్చారు. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలు లేక అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా ఘనంగా జరుపుకోవాలన్నారు.
ఎన్టీఆర్ కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో నెంబర్ 1 గా రాణించడమే గాక, తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేదవానికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సుపరిపాలన అందించారని ప్రశంసించారు. తెలుగువాడి ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పి, మన ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఘనుడు ఎన్టీఆర్ అని, అలాంటి మహానుభావుని శత జయంతి ఉత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్న ఎన్నారై టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోస్టన్ ఏరియా టీడిపి ఎన్నారై నాయకులతో పాటూ తానా మాజీ అధ్యక్షులు నన్నపనేని మోహన్, శ్రీనివాస్ గొంది, సుధాకర్ తురగా, అంకినీడు ప్రసాద్ రావి, శ్రీ బోల్ల, సూర్య తేలప్రోలు, అనిల్ పొట్లూరి, చంద్ర వల్లూరు పల్లి, సురేష్ దగ్గుబాటి, కోటేశ్వరరావు కందుకూరి, సురేష్ కమ్మ, రావి వేదల, గోపి నెక్కలపూడి, శరత్ బేతపూడి, బద్రి గుడివాడ, శ్రీకాంత్ చేబ్రోలు, రాజేష్ కాపు, హేమాద్రి లెక్కల, రావుల శ్రీనాథ్, పద్మ కందుకూరి, శిరీష గొంది తదితరులు పాల్గొన్నారు.
కనేక్టికట్ రాష్ట్రంలో…
కనేక్టికట్ రాష్ట్రంలో హార్ట్ఫోర్డ్ నగరంలో అక్టోబర్ 24న జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే మూడున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల అన్ని వర్గాల ప్రజల జీవనం అతలాకుతలమైందని, ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో.. కుక్కలు చింపిన విస్తరిలా అయిన రాష్ట్రాన్ని బాగు చెయ్యాలంటే ఒక్క చంద్ర బాబుపకే సాధ్యమని చెప్పారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఎన్నారై టిడిపి నాయకులు ఏపీలోని తమ తమ గ్రామాలకు వెళ్లి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వలన జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై టిడిపి నాయకులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నాయకులు తరణి పరుచూరి, అశ్విన్ అట్లూరి, ఎండురి శ్రీనివాస్, రావుల శ్రీనాథ్, సుధాకర్ తురగా, యోగేష్ అబ్బూరి, ప్రదీప్ గెడ్డం, తేజా రావెళ్ళ, ప్రదీప్ రావెళ్ళ, రాజశేఖర్ శాఖమూరి, దిలీప్ చిలకపతి, జాస్తి శ్రీకాంత్, రామారావు కాజ, పర్చూరి చక్రధర్, పాలడుగు భాస్కర్, నడిపినేని శ్రీధర్ పాల్గొన్నారు.













