వాషింగ్టన్ డీసీలో ఎన్నారై టీడీపీ సీడీ ఆవిష్కరణ

అమెరికా పర్యటనలో వున్నా తెలుగుదేశం మాజీ మంత్రి నక్క ఆనందబాబు ముఖ్య అతిధిగా హాజరై శ్రీనివాసరావు కొమ్మినేని తయారు చేసిన సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నక్కా మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాల లో ఆర్ధిక వనరులు లేకున్నా చంద్రబాబు కష్టపడి నిధులు సమకూర్చి రాజధాని నిర్మాణానికి పునాదివేశారన్నారు. విదేశీ పెట్టుబడులు తెచ్చి, నూతన పరిశ్రమలు సాధించి రాష్ట్రాభివృద్ధి కి కష్టపడి పనిచేసినా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ప్రతిపక్షం లో వుంటూ ప్రజల వాణిని వినిపిస్తామన్నారు. ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అధికారంలో వున్నా ప్రతిపక్షం లో వున్నా ప్రజాక్షేత్రం లో వుంటూ సేవ చేస్తామన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకలు మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పునాదుల మీద నిర్మించిన పార్టీ అని కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళినందువల్ల పార్టీ కి ఎలాంటి నష్టం లేదన్నారు. చంద్రబాబు, తెలుగుదేశం మీద వున్న కోపంతో ప్రభుత్వం అభివృద్హిని అడ్డుకోవద్దన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం ఆపడం అభివృద్హిని అడ్డుకోవడమే అన్నారు. గతంలో మిగులు వున్న విద్యుత్ ఇప్పుడు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు అన్నారు.
ఈసందర్భం గా ఎన్నారై తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి కొనసాగాలన్న నూతన పరిశ్రమలు రావాలన్న, మన పిల్లల భవిషత్ బాగుండాలన్న మరల తెలుగుదేశం అధికారం లోకి రావలసిన అవసరం ఇంటిని ఉందన్నారు. పార్టీ పటిష్ఠతకు ఎన్నారైలు తమవంతు కృషిచేస్తామన్నారు.
ఈకార్యక్రమంలో పాతూరి నాగభూషణం, సుఖవాసి శ్రీనివాస్, శ్రీనివాసరావు కొమ్మినేని, ఫణి బాబు ఉప్పల, వెంకట్ సూర్యదేవర, రాజా నల్లూరి, మల్లిక్ మేదరమెట్ల, ప్రవీణ్ వేజెండ్ల, వంశి, చందు గొర్రపాటి, శరత్ కొమ్మినేని, చొఎడారు ఆచంట, తదితరులు పాల్గొన్నారు.











































































