వాషింగ్టన్ డీసీలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా కృషి చేయాలని అమెరికాలో నివసిస్తున్న ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమం, సామాజిక న్యాయం, తెలుగుజాతి వికాసం కోసం పుట్టిన టీడీపీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. నాలుగు దశాబ్దాల టీడీపీ ప్రయాణంలో మృతి చెందిన నాయకులు, కార్యకర్తలకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు భాను మాగులూరి, మన్నవ సుబ్బారావు, సతీష్ వేమన, సత్యనారాయణ, నరేశ్ కొడాలి, సుధీర్ కొమ్మి, అనిల్ ఉప్పలపాటి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.













