అమెరికాలో ఘనంగా జరిగిన టీడీపీ 40వ వార్షికోత్సవం
జయరాం కోమటి ఆధ్వర్యంలో 40 నగరాల్లో ఘనంగా వేడుకలు
తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ ‘నందమూరి తారక రామారావు’ ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసింది. ప్రాంతీయ పార్టీలు తలచుకుంటే జాతీయ పార్టీలను మట్టి కరిపించగలవని నిరూపించిన పార్టీగా చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ తర్వాత పగ్గాలు చేపట్టిన, ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లారు. జాతీయ రాజకీయాలలోను పార్టీకి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చారు. అనేక రూపాల్లో జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించి పార్టీ సత్తా చాటారు. ఉమ్మడి రాష్ట్రంతో సహా నవ్యాంధ్రలోనూ అనేక సంచలనాలకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వేదికగా మారింది. 1983లో అన్నగారు స్థాపించిన ఈ పార్టీ తాజాగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ టీడీపీ శ్రేణులు టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం కోమటి నాయకత్వంలో 40 నగరాలలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలుగుదేశం నాయకులు తణుకు మాజీ శాసనసభ్యుడు రాధాకృష్ణ ఆరిమిల్లి (షార్లెట్ లో), మాజీ శాసన మండలి సభ్యుడు రవిచంద్ర బీద (చికాగోలో), జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కొమ్మారెడ్డి (డాల్లస్ లో), పశ్చిమ గోదావరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు ముళ్ళపూడి (డల్లాస్ లో), టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు బుచ్చి రాంప్రసాద్ కలపటపు మరియు మోహన కృష్ణ మన్నవ (న్యూజెర్సీ లో ) ప్రత్యక్షంగా ఈ వేడుకల్లో పాల్గొని ఎన్నారై టీడీపీ అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఇక తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు మరియు టెక్కిలి శాసనసభ్యులు అచ్చెన్నాయుడు కింజరపు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు , టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు బుచ్చయ్య చౌదరి గోరంట్ల, పాలకొల్లు శాసనసభ్యులు రామానాయుడు నిమ్మల, విజయవాడ తూర్పు శాసనసభ్యులు రామ్మోహన్ గద్దె, అద్దంకి శాసనసభ్యులు రవి గొట్టిపాటి, పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు ఏలూరి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు కింజరపు, దెందులూరు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చింతమనేని, నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు అయ్యన్నపాత్రుడు చింతకాయల, మైలవరం మాజీ శాసనసభ్యులు ఉమామహేశ్వర్ దేవినేని, పొన్నూరు మాజీ శాసనసభ్యులు నరేంద్ర ధూళిపాళ్ల మరియు విజయవాడ మాజీ మేయర్ అనూరాధ పంచుమర్తి తదితరులు జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించి వారిని ఉత్తేజపరిచారు.
కాలిఫోర్నియాలో…
కాలిఫోర్నియాలో జరిగిన టీడిపి 40వ వార్షికోత్సవ వేడుకల్లో తెలుగు దేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మిల్పిటాస్లోని స్వాగత్ రెస్టారెంట్లో జరిగిన ఈ వేడుకల్లో ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం కోమటి ఈ సందర్భంగా 40వ వార్షికోత్సవ కేక్‌ను కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, భక్తబల్లా తదితరులు పాల్గొన్నారు.
అట్లాంటాలో….
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక బావర్చి రెస్టారెంట్ ఈవెంట్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలలో సుమారు 150 మంది పాల్గొన్నారు. మురళి బొడ్డు మరియు వినయ్ మద్దినేని ఈ కార్యక్రమాన్ని ముందుండి సమన్వయం చేసారు. ముందుగా వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆహుతులు అందరూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీఆర్ పఠానికి పూలతో నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ 40 వసంతాల థీమ్ తో ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ కట్ చేసి అందరికీ పంచారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగించారు. వేణు దండా వారి బావర్చి రెస్టారెంట్ సమకూర్చిన రుచికరమైన విందు భోజనాల అనంతరం, ఆహూతులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
ఛార్ల్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో…
నార్త్ కరొలినా రాష్ట్రంలోని ఛార్లెట్ నగరంలో ఎన్నారై టీడీపీ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో టీడిపి 40వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశాన్ని అనంతపూర్ ప్రవాసాంధ్రుడు పురుషోత్తం చౌదరి గుడే అధ్యక్షతన ఠాగూర్ మల్లినేని సమన్వయం చేసారు. ఈ పసుపు పండుగని విజయవంతం చేయడంలో రవి నాయుడు, వెంకట్ మాలపాటి మరియు సచీన్ద్ర ఆవులపాటి సహకారం అందించారు. రాయలసీమ నుంచి అనంతపూర్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆన్ లైన్ లో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొనడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత మోహన్ కొవ్వలి ఈ కార్యక్రమానికి ముఖాముఖీగా హాజరవ్వడం విశేషం.
సీటెల్‌లో…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీడీపీ సీటెల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
న్యూజెర్సిలో…
న్యూజెర్సిలో తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడిపి నాయకుడు మోహన్ కృష్ణ మన్నవ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ఎన్నారై అభిమానులు పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు బుచ్చిరాంప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి చరిత్ర సృష్టిస్తూ వస్తోందని, నవ్యాంధ్ర ప్రగతికి ఎన్నో బాటలు వేసిందని చెప్పారు. మోహన్ కృష్ణ మన్నవ మాట్లాడుతూ, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డిట్రాయిట్లో…
ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని డిట్రాయిట్లో ఘనంగా నిర్వహించారు. డిట్రాయిట్‌లోని రావుగారు విందు రెస్టారెంట్లో డిట్రాయిట్ తెలుగుదేశం కౌన్సిల్ మెంబర్స్ సురేష్ పుట్టగుంట, కిరణ్ దుగ్గిరాల, దంతేశ్వర్రావ్, మనోరమ గొంది, సీత కావూరి, ఉమామహేశ్వర రావు ఓమ్మి, జోగేశ్వరరావు పెద్దబోయిన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బోస్టన్‌లో…
బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని చంద్రబాబు సందేశాన్ని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఎన్నారైలు మాతృభూమి కోసం పడుతున్న తాపత్రయాన్ని గుర్తించి వారి సేవలను కొనియాడారు.
కన్సాస్‌లో…
మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీలో టీడిపి 40వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. వ్యవస్థాపకుడు, మహానేత అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావు ద్రోణవల్లి, వెంకట నల్లూరి, అరుణ్ కొమ్మినేని, రథన్ కొమర్నేని, నిరుపమ కొమ్మినేని తదితరులు ప్రసంగించారు. కాన్సస్ సిటీ టీడీపీ బృందం కోడె శ్రీనివాస్, ప్రకాష్ కన్యాదార, వెంకట్ గొర్రెపాటి, శ్రీనివాస్ దామ, సోమశేఖర్ పెమ్మసాని, నాయుడు వట్టిగుంట, సురేష్ తుమ్మల, గోపి మాదాల, గౌతం నల్లూరి తదితరులు కేక్ కటింగ్‌తో వేడుకను ముగించారు.
డల్లాస్‌లో
డల్లాస్‌లో తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా డల్లాస్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు మోటార్ సైకిల్ ర్యాలీ, కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో డల్లాస్‌లో ఉన్న తణుకు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, టిడిపి ఫైర్‌బ్రాండ్ పట్టాభిరామ్, ముళ్ళపూడి బాపిరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్థానిక టిడిపి నాయకులు కెసి చేకూరి, లోకేష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లాస్ ఏంజెలిస్‌లో…
లాస్ ఏంజలస్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పండుగను ఘనంగా జరిపారు.













